తేలుకుట్టిన దొంగలా దాక్కున్న విజయసాయిరెడ్డి - విచారణకు హాజరైతే బండారం బట్టబయలు : టీడీపీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 12:37 PM IST

Bonda Uma On Vijayasai Reddy ICAI Disciplinary Committee Notice : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఐసీఏఐ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసును సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ పై తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన స్టే ను నాలుగు వారాల పాటు పొడిగించింది. విజయసాయి రెడ్డి సీఏ చెన్నైలో రిజిస్టర్‌ చేసుకున్నారని తెలంగాణ హైకోర్టులో విచారణ అర్హత కాదని ఐసీఏఐ తరపు న్యాయవాది వాదించారు. వివాదానికి మూలమైన జగతి పబ్లికేషన్స్‌ హైదరాబాద్‌లోనే ఉండటంతో ఛార్జిషీట్లను సీబీఐ తెలంగాణ కోర్టులోనే వేసిందని ఎంపీ తరపు న్యాయవాది ఎస్‌.నిరంజన్‌ రెడ్డి వాదించారు. ఇరువాదనలు విన్న హైకోర్టు పూర్తిస్థాయి విచారణ చేప్టటి కౌంటరు దాఖలు చేయాలని ఐసీఏఐని ఆదేశించింది. విజయసాయి రెడ్డి పిటిషన్ పై విచారణ డిసెంబర్‌ 20 కి వాయిదా వేసింది. 

ఐసీఏఐ క్రమశిక్షణా చర్యల పిటిషన్‌ వేస్తే విజయసాయి రెడ్డి ఎందుకు తేలుకుట్టిన దొంగలా దాక్కుంటున్నాడని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. అక్టోబర్ 23న వేసిన నోటీసులపై ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. గతంలో అరబిందో, హెటిరో, రాంకీ, దాల్మియా నుంచి జగతిలోకి వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. కోర్టులో స్టే కాకుండా విచారణకు హాజరైతే విజయసాయిరెడ్డి బండారం బట్టబయలు అవుతుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.