బలుసు తిప్ప పడవ పందాలు - వంద ప్రాంతాల నుంచి నలభై బోట్లతో పోటీ - వంద ప్రాంతాల నుంచి 40 బోట్లు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 1:40 PM IST
Boat Races In Godavari River In Konaseema District: కోనసీమ జిల్లా ముమ్మిడివరం గోదావరి నది పాయల్లో సంవత్సరం పాటు ఏ ప్రాంతంలోనైనా వేట చేసుకునేందుకు వీలుగా మత్స్యకార గ్రామాల మధ్య పోటీ నిర్వహిస్తుంటారు. కాట్రేనికోన మండలం బలుసు తిప్ప మత్స్య కారులు చేపలు పట్టుకోవడానికి వలకట్లు ఏర్పాటు చేసుకోవడం కోసం సంవత్సరానికి ఒక్కసారి ఈ పడవ పందాలు నిర్వహిస్తుంటారు. ఏ గ్రామానికి చెందిన పడవ ముందుగా నిర్దేశిత ప్రాంతానికి వెళుతుందో ఆ గ్రామం వారు ఏడాది పాటు గుర్తించబడిన ప్రాంతాల్లో చేపల వేట సాగించుకోవచ్చని అక్కడ మత్యకారులు చెబుతున్నారు.
ఈ పోటీలకు సుమారు 100ప్రాంతాలను నుంచి 40 బోట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఒక్కొక్క బోటులో నాలుగు కుటుంబాలు ఉంటాయి. అయితే ఈ పోటీలు వివాదాలకు తావులేకుండా రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖ అధికారుల సమక్షంలో జరగుతాయి. ఈ సంవత్సరం అధికారులు రాకుండానే గ్రామస్థులు పోటీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ పోటీలు జరగటం గ్రామ పెద్దల మధ్య విభేదాలే కారణంగా స్థానికులు భావిస్తున్నారు.