BJP on Panchayat Agitations: పంచాయతీల నిధుల స్వాహాపై.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపు - పంచాయతీల నిధుల స్వాహాపై ఆందోళనకు బీజేపీ పిలుపు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-08-2023/640-480-19214879-59-19214879-1691500627953.jpg)
BJP Purandeshwari on Panchayat Funds Diversion in AP: గ్రామ పంచాయతీల నిధులు స్వాహా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ నెల 10వ తేదీన కలెక్టరేట్ల వద్ద తలపెట్టిన ఆందోళనను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. పంచాయతీల నిధులు స్వాహా చేస్తే సర్పంచ్లు గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల గ్రామ పంచాయతీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్ధితిలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
"సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తూ.. గ్రామాలకు అందించవలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వారికి అందించట్లేదు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం అందించిన నిధులను సైతం దారి మళ్లిస్తోంది. ఇలా రాష్ట్రం ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తిలోదకాలిస్తోంది. దీనిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టనుంది. రాష్ట్ర ప్రజలంతా ఈ ఆందోళనలో మాకు సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాను." - దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు