సంక్షేమ పథకాలకు జగన్ ఫొటో - బీజేపీ నేతల ఆగ్రహం - jagan photo
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 9:30 PM IST
BJP Leaders Questioned on Only Jagan Photo: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నడిపిస్తూ.. కరపత్రాలలో ముఖ్యమంత్రి బొమ్మ మాత్రమే ఉండడంపై కర్నూలు బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ప్రకారం ఫొటోలను ఎందుకు ముద్రించలేదని అధికారులను ప్రశ్నించారు. కరపత్రంపై మోదీ చిత్రం ఎందుకు ముద్రించలేదని అధికారులను నిలదీశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా గోనెగండ్లలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులను స్థానిక బీజేపీ నేతలు ప్రశ్నించగా వారు సమధానం చెప్పలేక ఇబ్బందిని ఎదుర్కోన్నారు.
జగనన్న కాలనీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తోందని.. ఆ నిధులతో పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నారని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం ముఖ్యమంత్రి జగన్ ఫొటోనే ముద్రించుకుని ప్రచారం చేసుకుంటోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకోనున్నారు.