జగన్ హయాంలో మొఘల్ పాలన సాగుతోంది: భానుప్రకాష్ రెడ్డి - Bhanu Prakash Reddy comment on jagan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 7:08 PM IST
BJP Leader Bhanu Prakash Reddy Comments on Jagan Government: రాష్ట్రంలో జగన్ అధికారంలో మొఘల్ పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దేవాలయాల నుంచి సుంకం మొఘల్ పాలనలో వసూలు చేసేవారని.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తోందని భానుప్రకాష్ మండిపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న భాను ప్రకాష్ జగన్ సర్కార్‌పై పలు వ్యాఖ్యలు చేశారు.
BJP Leader Bhanu Prakash about Tirupathi Devastanam: తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి ఖజానాను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని భానుప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. మొఘల్ పాలనలో వసూలు చేసిన సుంకం మాదిరిగా ప్రస్తుతం జగన్ వసూలు చేస్తోందని మండిపడ్డారు. స్వామి వారి హుండీ సొమ్మును జగన్ సర్కార్ దారి మళ్లిస్తుందన్నారు. పౌర సమాజం అంటూ కొందరు హడావుడి చేస్తున్నారని.. తిరుపతిలోని గంజాయి దందా, కబ్జాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి అదనపు నిధులు తెచ్చుకొని అభివృద్దికి వాడాలని హితవు పలికారు. ఎన్నికల ముందు తిరుపతి అభివృద్ది గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. తిరుపతి అభివృద్దికి బీజేపీ వ్యతిరేకం కాదని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.