Hero Venkatesh On Social Media Fake Posts : సామాజిక మాధ్యమాల్లో విస్తరిస్తున్న చెడు పోస్టులకు అడ్డుకట్టవేసేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి సినీ నటుడు వెంకటేష్ మద్దతు పలికారు. దీని వలన కలిగే అనర్థాలు వివరిస్తూ ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. సామాజిక మాధ్యమాలను మంచి విషయాలకే వినియోగిద్దామన్నారు. అసభ్య పదజాలాన్ని వాడొద్దని, అసత్య ప్రచారాలు చేయవద్దని, చెడు పోస్టులు పెట్టవద్దని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు : ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మంచి పోస్ట్‌ల కంటే చెడు పోస్టులే ఎక్కువ పెడుతున్నారు. తమకు ఇష్టంలేని వ్యక్తులపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లుగా పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబుకు కొంతమంది ఫిర్యాదు చేశారు. ఆడవాళ్లను కూడా వదిలిపెట్టకుండా సోషల్ మీడియాలో విష ప్రచారాన్ని, వ్యక్తిత్వ హననం చేయడాన్ని ఏపీ సర్కారు సీరియస్‌గా తీసుకుంది. ఫేక్ వీడియోలతో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
నెటిజన్లను చైతన్యపరిచే విధంగా హోర్డింగ్‌లు : సోషల్ మీడియా విషయంలో ప్రజలను, నెటిజన్లను చైతన్యపరిచే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదామని అసత్య ప్రచారాలకు, ధూషణలకు స్వస్థిపలుకుదాం అంటూ పలు నగరాల్లో భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.
త్రీ మంకీస్ బొమ్మకు ఫోర్త్ మంకీ : త్రీ మంకీస్ బొమ్మకు ఫోర్త్ మంకీ చేర్చి చెడు పోస్టులు వద్దంటూ, పోస్ట్ నో ఈవిల్ పేరుతో ఫోర్త్ మంకీ బొమ్మతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ప్రజలందరికీ అర్థమయ్యేలా ఆంగ్లం, తెలుగు భాషల్లో వీటిని రూపొందించారు. 'మేక్ సోషల్ మీడియా ఏ పాజిటివ్ ఎక్స్ పీరియన్స్ అనే పేరుతో పలు ప్రధాన రహదారుల్లో హోర్డింగ్స్ వెలిశాయి. 'చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు' అనే గాంధీజీ సూక్తితో సోషల్ మీడియాపై క్యాంపెయిన్ చేపట్టారు.
మూడు కోతులు కాదు-నాలుగోది వచ్చింది! విజయవాడలో ఆకట్టుకుంటున్న ఫ్లెక్లీలు,హోర్డింగ్‌లు
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకెళ్తున్నారా? వెయిట్ ఏ మినిట్! ఈ విషయాలు తెలుసా మరి?