YV Subbareddy on Amit Shah: "టీడీపీ ట్రాప్‌లో బీజేపీ.. అమిత్ షా ప్రసంగమంతా వారి మాటలే" - వైవీ సుబ్బారెడ్డి
🎬 Watch Now: Feature Video
YV Subbareddy on Amit Shah Comments: తెలుగుదేశం పార్టీ ట్రాప్‌లో బీజేపీ పడిందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. విశాఖలోని జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయం శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతల మాటలే ప్రసంగంలో అమిత్ షా మాట్లాడారని అన్నారు. అసలు వైజాగ్ అమిత్ షా నిర్వహించిన కార్యక్రమంలో స్టేజ్‌పై ఎవరున్నారో తెలుసు కదా అని ప్రశ్నించిన ఆయన..స్టేజ్‌పై ఉన్నవారంతా టీడీపీ నాయకులే అని వ్యాఖ్యానించారు. పసుపు కండువా తీసి కాషాయ కండువా వేసుకున్న నాయకులు స్టేజ్‌పై ఉన్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీతో మిత్రపక్షంగా కొనసాగిన బీజేపీ అప్పుడు ఏం చేసిందని ప్రశ్నించారు. టీడీపీ అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం లేదా అని ఆరోపించారు. అమిత్ షా వైజాగ్ వచ్చి.. ఈ ప్రాంతం గురించి ఒక్క మాట చెప్పకపోవడం దారుణమని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అమిత్ షా ఎందుకు మాట్లాడరని.. విశాఖలో ఫార్మా రంగం అభివృద్ధి చేసింది దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.