Bees Attack On Workers: ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి.. 9 మందికి గాయాలు - AP TOP NEWS TODAY

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 30, 2023, 4:38 PM IST

Bees Attack On Workers in Rajampet : వేసవి కాలం వచ్చిందంటే పల్లె ప్రజలు ఉపాధి హామీ పనులకు వెళుతుంటారు. అలా వెళ్లిన వారిలో 9 మంది ఎవ్వరూ ఊహించని విధంగా గాయపడ్డారు. తేనె టీగల దాడిలో ఉపాధి హామీ కూలీలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామస్థులు కూలీ పనికి వెళ్లారు. వెంకటం పల్లి గుట్ట వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న సమయంలో హఠాత్తుగా కూలీలపై తేనె టీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 9 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. తక్షణమే తేనె టీగల దాడిలో గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి హూటాహూటిన తరలించారు. వెంకట సుబ్బయ్య, జయమ్మ, గౌరమ్మ దేవి, వెంకట రమణ తదితరులు గాయపడ్డారు. వారికి వైద్యులు చికిత్స అందించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.