ఊటీ, కొడైకెనాల్‌ను తలపిస్తోన్న తిరుమల - అందాలను ఆస్వాదిస్తున్న పర్యటకులు - తిరుమల కొెండలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 3:26 PM IST
Beautiful Snow At Tirumala Hills : తిరుమల కనుమదారుల్లో వాతావరణం ఊటీ, కొడైకెనాల్‌ను తలపిస్తోంది. కొండ కోనల నడుమ ఘాట్ రోడ్డు, ప్రకృతి అందాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. కొండలోయల సోయగాలు భక్తులను మైమరింపజేస్తున్నాయి. అసలే శీతల వాతావరణం.. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న చిరుజల్లులతో చలి తీవ్రత పెరగటంతో భక్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఘాట్ రోడ్డు వెంట ప్రయాణిస్తున్న జనాలు ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ మంచు మబ్బులతో అందగా ఉన్న పరిసరాలను చూస్తున్న పర్యటకులు మైమరచిపోతున్నారు.
Thirumala Hills Ap Updates : అసలే చలి కాలం అందులోనూ మంచు తుంపరలతో పరిసరాలు మరింత చల్లగా మారాయి. ప్రకృతి ఒడిలో హిమంతో కప్పిన కొండల నడుమ చలి దుప్పట్లో వణుకుతూ తిరుమల వాసులు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న చిరు జల్లులతో తిరుమలలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రజలకు చలి తిప్పలు తప్పడం లేదు.