Bear Roaming in Anantapur District: అక్కడ ఇళ్ల పక్కనే తిరుగుతున్న భల్లూకం..! అటవీ అధికారుల రాక కోసం ఎదురుచూపులు - ఎలుగుబంటి సంచారం
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 24, 2023, 1:53 PM IST
Bear Roaming in Anantapur District: అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి సంచారంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంటి యథేచ్ఛగా జనావాసాలకు అతి సమీపంలోనే సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో కర్ణాటక వైపు వెళ్లే రహదారి పక్కన యథేచ్ఛగా ఎలుగుబంటి సంచరిస్తుండటాన్ని కొంతమంది చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. కాగా ఈ దృశ్యాలు కాస్తా సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం తీవ్రంగా వైరల్ అయ్యాయి. దీంతో స్థానికులు నిత్యం భయంతో గడుపుతున్నారు.
Bear Hulchul in Anantapur district kambadur: ఏ సమయంలో ఎటువైపు నుంచి ఎలుగుబంటి వచ్చి దాడి చేస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. తరచూ పరిసర ప్రాంతాలలో సంచరిస్తూ తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న ఎలుగుబంటిని అటవీ శాఖ అధికారులు పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఎలుగుబంటి దాడి చేయకుండా తమను కాపాడాలని స్థానికులు అటవీ అధికారులను కోరుతున్నారు.