టీడీపీలో చేరాడనే అక్కసుతో దుకాణం తొలగింపు - Barber Shop Remove
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 2:04 PM IST
Barber Shop Removed After Joining in TDP: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నాడని ఓ వ్యక్తికి చెందిన దుకాణాన్ని తొలగించారు. నంద్యాల జిల్లా మహానంది ఆలయ ఆవరణలో సుబ్బారాయుడు అనే వ్యక్తి బతుకు దెరువు కోసం క్షౌరశాల నిర్వహిస్తున్నారు. ఇటీవలే సుబ్బరాయుడు టీడీపీలో చేరారు. దీంతో కక్ష కట్టిన వైఎస్సార్సీపీ నాయకులు సుబ్బారాయుడు దుకాణాన్ని తొలగించారు. ఉన్న ఒక్క బతుకుదెరువును తొలిగించటంతో నేను ఎలా బతకాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
తాను టీడీపీలో చేరినందుకే వైఎస్సార్సీపీ నాయకులు ఆలయ సిబ్బందితో కలిసి కుట్ర పూరిత చర్యకు పాల్పడ్డారని సుబ్బారాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు తొలగిస్తున్నారని అడిగితే ఆలయ అభివృద్ధిలో భాగంగా, ఆలయ ఛైర్మెన్ ఆదేశాలతో తొలగిస్తున్నామంటూ సమాధానం ఇచ్చారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఉరిశిక్ష వేసే ఖైదీ కన్నా చివరి అవకాశం ఇస్తారు. కానీ నాకు ఒక్క మాట కూడా తెలియపరచకుండా దుకాణాన్ని రోడ్డుపై పడేసి వైఎస్సార్సీపీ నేతలు అక్కసు వెళ్లబుచ్చారని సుబ్బారాయుడు మండిపడ్డారు.