మస్తాన్‌వలీ ముంచేశాడుగా! - ₹ 58 లక్షలు ఖాతాలో వేసుకున్న బ్యాంక్ క్యాషియర్ - బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్యాషియర్ స్కామ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 1:25 PM IST
Bank Cashier Fraud in Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్‌లో క్యాషియర్ చేతి వాటం ప్రదర్శించారు. ఏకంగా 58 లక్షల రూపాయల సొమ్ము స్వాహా చేశాడు. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం చిలకలూరిపేటకు చెందిన ఎస్కే మస్తాన్ వలీ మచిలీపట్నం బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల బ్యాంక్‌లో అంతర్గత ఆడిట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్యాంకులో ఉండాల్సిన మొత్తంలో 58 లక్షల రూపాయలు తేడా కనిపించింది. దీనిపై బ్యాంక్ అధికారులు విచారించగా గడిచిన మూడు నెలలలో మూడు విడతలుగా ఆ మొత్తం క్యాషియర్ మస్తాన్ వలీ ఖాతాకు జమ అయినట్లు గుర్తించారు. మస్తాన్ వలీని బాధ్యుడిగా చేస్తూ బ్యాంక్ మేనేజర్ ఆర్‌పేట పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన మస్తాన్ వలీ ఏడాది క్రితం బదిలీపై మచీలపట్నం బ్రాంచ్‌కు క్యాషియర్‌గా వచ్చాడు.