పార్టీ శ్రేణులతో బాలయ్య సమీక్ష సమావేశాలు - ఎన్నికలకు ముమ్మరంగా కసరత్తు - ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 5:06 PM IST

Balayya Meeting in Satya sai District : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో దూసుకుపోతున్నాయి. కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

Nandamuri Bala krishna Meeting with His Consituency TDP Leaders : లేపాక్షి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ అంతర్గత సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. మండలంలో 12 పంచాయతీలు ఉండగా ఒక్కో పంచాయతీకి చెందిన నాయకులు, కార్యకర్తలను పిలిపించుకొని గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్​సీపీ పాలనను ఏ విధంగా ఎండగట్టాలనే విషయంపై కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. బాలయ్యతో సమీక్ష సమావేశాల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో తిరిగి తమ గ్రామాలకు వెళ్లామన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.