Colour stones: రంగురాళ్ల వ్యవహారాన్ని వదిలి పెట్టను: అయ్యన్నపాత్రుడు
🎬 Watch Now: Feature Video
Ayyanna On Colour Stones: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సాలిక మల్లవరం వద్ద రిజర్వ్ ఫారెస్ట్‌లో రంగురాళ్లు మట్టి తవ్వకాలపై అధికారులు నేటికీ స్పందించకపోవడం విచారకరమని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని విలేకరులకు ఓ వీడియో విడుదల చేశారు. రంగు రాళ్లు తవ్వకాల కేసులో ఇప్పటికే లోకాయుక్త, ఫారెస్ట్ ఉన్నతాధికారులకు తానే స్వయంగా ఫిర్యాదు చేశానని తెలిపాడు. అయినా నేటి వరకు చలనం లేదని.. ఇందులో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే కోర్టును ఆశ్రయిస్తాం అని అన్నారు. అటవీశాఖ అధికారులు, పోలీసుల ఫోన్లను సీజ్ చేసి పరిశీలన చేయాలని ఆయన కోరారు.
రిజర్వ్ ఫారెస్ట్ లో రంగురాళ్లు మటి తవ్వకాల ఘటన జరిగి నేటికీ సుమారు 9 రోజులు అవుతుంది. ఇంకా ఎవరి మీద చర్యలు తీసుకోవడం లేదు. ఏదో మొక్కుబడిగా ఫారెస్ట్ అధికారులు ఫొటోలు తీసుకున్నారు అంతే..! ఆ ట్రాక్టర్లు ఎక్కడికిపోయాయి..? తవ్విన జేసీబీలు ఎవరివి అని ఎందుకు కనిపెట్టలేకపోయారు, ఎందుకు పట్టుకోలేకపోయారు. ఈ కార్యక్రమం మామూలు వ్యక్తులు చేసే పని కాదు అందరూ కలిసి ప్లాన్‌తో అమలు చేశారు.- అయ్యన్నపాత్రుడు,టీడీపీ నేత