హత్యలే కాదు - ఆత్మహత్యలు చేసుకునేలా వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది : శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ - guntur crime news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 1:10 PM IST
Attacks on Minorities During YCP Government : హత్యలు చేయడమే కాకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని వైసీపీ నాయకులు కల్పిస్తురని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఎంపీ నందిగం సురేష్ అనుచరుల వేధింపులు తాళలేక నౌషద్ అనేె వ్యక్తి ఆత్మహత్యకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రీచ్ కోసం సురేష్ అనుచరుడు రేపల్లె సన్నీ రూ.25 లక్షల అప్పు తీసుకుని మోసం చేశాడని వ్యాఖ్యానించారు. దీంతో నౌషద్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో నందిగం సురేష్ నుంచి వీరికి బెదిరింపులు వచ్చాయని తెలిపారు.
MP who Threatened the Young Man : నందిగం సురేష్ నుంచి బెదిరింపులు రావడంతో మనస్థాపనికి గురైన నౌషద్ గురువారం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు అతన్ని గుంటూరులోని లలిత ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న నౌషద్ను షరిఫ్, గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ పరామర్శించారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు స్పందించటం లేదని షరిఫ్ ధ్వజమెత్తరు. వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలపై వేధింపులు, దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.