రెచ్చిపోయిన నాటు సారా తయారీదారులు.. సెబ్ అధికారులపై దాడి - అధికారులపై నాటుసారా తయారీదారుల దాడి
🎬 Watch Now: Feature Video
Attack on SEB Officials: నాటు సారా స్థావరాలను నడిపేవారు చాలా రహస్యంగా.. సారా తయారు చేస్తారు. ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా స్థావరాలను నడుపుతారు. ఏ సమయంలో అధికారులు వచ్చి పట్టుకుంటారో అని భయపడుతూ ఉంటారు. ఎవరైనా అధికారులు వస్తున్నారంటే ఇంకేముంది పరుగో పరుగు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. నాటు సారా స్థావరాలపై తనిఖీ చేసేందుకు వెళ్లిన అధికారులను ఊహించని ఘటన ఎదురైంది. అధికారులు ఎంత చెప్పినా వారు మాత్రం మాట వినలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
నాటు సారా స్థావరాలపై తనిఖీకి వెళ్లిన సెబ్ అధికారులపై తయారీదారులు దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ మండలం బుగ్గ తాండాలో చోటు చేసుకుంది. తాము సెబ్ అధికారులమని చెప్పినా.. దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సెబ్ టీం ఎస్సైకి గాయాలయ్యాయి. వెంటనే గ్రామానికి చేరుకున్న పత్తికొండ పోలీసులు దాడి చేశారనే అనుమానం ఉన్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు.