Attacks on Dalit woman: పోటీ పడి ఉద్యోగం దక్కించుకుందని.. దళిత అంగన్వాడీ ఆయాపై దాడి - Attack on Dalits
🎬 Watch Now: Feature Video
Attack on SC Anganwadi Aaya :అనంతపురం జిల్లా కంబదూరు మండలం జల్లిపల్లి గ్రామంలో అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్న దళిత మహిళ యశోదమ్మ పై అదే గ్రామానికి చెందిన యానిమేటర్ రాధమ్మ కుటుంబ సభ్యులు దాడి చేశారు. రెండేళ్ల క్రితం అంగన్వాడీ ఆయా ఉద్యోగం కోసం తమతో పాటు అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు పోటీ పడ్డారని.. అయితే దళితులమైన మాకు అంగన్వాడీ ఆయా ఉద్యోగం వచ్చిందని తరచూ తమపై దాడులకు దిగుతూ... తీవ్రంగా గాయపరుస్తున్నారని ఆయా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీలమైన తమపై దాడి చేసి అవమానించిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యశోదమ్మ కుటుంబ సభ్యులతో పాటు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన యశోదమ్మను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చెేర్పించి చికిత్స అందిస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామానికి చెందిన యానిమేటర్ రాధమ్మ కుటుంబ సభ్యులు రాజేంద్ర, దిలీప్ కుమార్ తో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి ఆయాపై దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచారని యశోదమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.