బస్సును కదిలించే సమయంలో కిందపడిన విద్యార్థిని - డ్రైవర్‌పై స్థానికుల దాడి - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 21, 2023, 6:56 PM IST
Attack on RTC Bus Driver in Nellore District : నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి వద్ద ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై స్థానికులు దాడి చేశారు. నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్తున్న ఆర్టీసీలో ప్రయాణికుల బస్సును వాసిలి స్టాప్ వద్ద స్థానికులు ఆపారు. అప్పటికే బస్సు నిండా ప్రయాణికులు ఉండటంతో కొంతమందిని ఎక్కించుకున్న కండక్టరు మిగిలిన వారిని మరో బస్సులో రావాలని సూచించారు. డ్రైవర్ బస్సును ముందుకు కదిలించే క్రమంలో ఓ విద్యార్థిని కిందపడిపోయింది. స్థానికులు బస్సును నిలిపి డ్రైవర్‌పై దాడికి దిగారు. ఘటనపై స్పందించిన ఆత్మకూరు డిపో మేనేజరు కరీమున్నీస పోలీసులకు ఫిర్యాదు చేశారు.
RTC Bus Driver Attacked At Nellore : తాను గత రెండు సంవత్సరాలుగా ఆర్టీసీలో పని చేస్తున్నా అని ఎప్పుడూ తనకు ఇలా జరగలేదన్నారు డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులో చోటు లేదు మరో బస్సులో రావాలన్నందుకు నాపై దాడికి పాల్పడడం దారుణం అని బాధిత డ్రైవర్ వాపోతున్నారు.