Attack on Pastor: పాస్టర్ల మద్య ఘర్షణ.. పాస్టర్, అతని భార్యపై మరో వర్గం దాడి! - చర్చి పాస్టర్‌పై దాడి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-06-2023/640-480-18842958-549-18842958-1687692861484.jpg)
Attack on Pastor: గుంటూరు జిల్లా పొన్నూరు అంబేడ్కర్ కాలనీలోని ఏఈఎల్సీ చర్చిలో పాస్టర్ల మద్య ఘర్షణ కలకలం రేపింది. ఆంధ్ర లూథరన్ ఇవాంజెలికల్ చర్చి తూర్పు గుంటూరు అధ్యక్షుడు ఉత్తర్వుల మేరకు బదిలీపై వెంకటరత్నం అంబేడ్కర్ కాలనీలోని ఏఈఎల్సీ చర్చిలో విధులు నిర్వహించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాస్టర్ టైటాస్ దేవకుమార్, పాస్టర్ మిక్కిలి పాల్ ప్రసాద్ కొందరు అనుచరులతో వెంకటరత్నం, అతని భార్యపై మూకుమ్మడిగా దాడి చేశారు. పాస్టర్ వెంకటరత్నంను బయటకు వెళ్లగొట్టారు.
దీనిపై ఏఈఎల్సీ అధ్యక్షుడు కనపర్తి ఆశీర్వాదానికి వెంకటకరత్నం ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అధ్యక్షుడు ఆశీర్వాదం హామీ ఇచ్చారు. ఏఈఎల్సీ చర్చి అంతర్గత గొడవలు పెరుగుతున్న క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు ఎలాంటి ఘర్షణలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. గతంలో కూడా పాత పొన్నూరు ఏఈఎల్సీ చర్చి పాస్టర్ల బదిలీ విషయమై పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగి.. వారాలు తరబడి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.