కడపలో సీఐపై యువకుల మూకుమ్మడి దాడి - కారణం ఏమిటంటే! - attack on police

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 12:42 PM IST

Assam Youth Attack on Intelligence CI : కడప ఆర్కేనగర్​లో అసోం యువకులు, ఇంటెలిజెన్స్ సీఐ మధ్య తెల్లవారుజామున ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో సీఐకి స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే, అస్సాం యువకులు ఓ హోటల్లో పని చేస్తూ ఆర్కే నగర్​లో గదులను అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ సీఐ అనిల్ కూడా అదే ఆర్కే నగర్‌లో ఉంటున్నారు. అసోం యువకులు గతంలో అల్లర్లు చేస్తుంటే సీఐ అనిల్ వారిని ప్రశ్నించారు. అప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. 

Clash Between Assam Youth Intelligence CI Anil : ఈ నేపథ్యంలో తెల్లవారుజామున అసోం యువకులు గొడవ చేస్తుంటే సీఐ ఎందుకు గొడవ చేస్తున్నారని వారిని ప్రశ్నించారు. యువకులు వినకపోవడంతో వారిపై సీఐ చేయి చేసుకున్నారు. ఇంతలో అసోం యువత అంతా కలిసి సీఐపై దాడికి పాల్పడ్డారు. దాడిలో సీఐకి గాయాలయ్యాయి. సీఐని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించారు. రంగంలో దిగిన పోలీసులు అసోం యువకులను పోలీస్ స్టేషన్​కు తరలించి విచారణ చేపట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.