APRSA Bopparaju Venkateswarlu : 'రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి.. స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం' - Jaganna Suraksha
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2023, 7:45 PM IST
APRSA Bopparaju Venkateswarlu: రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలని ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ (AP Revenue Service Association) రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గుంటూరు రెవెన్యూ భవన్‌లో సంఘ సమావేశం నిర్వహించారు. పని ఒత్తిడితో రెవెన్యూ ఉద్యోగుల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష (Jaganna Suraksha) కార్యక్రమం ద్వారా ఎన్ని పత్రాలు ఇచ్చామో తెలీదు... ఇప్పుడు మరలా జగనన్న ఆరోగ్య సురక్ష అంటున్నారు.. అందులోనూ రెవెన్యూ పాత్ర ఉంది.
కీలకమైన ఎన్నికల ప్రక్రియను సక్రమంగా నిర్వహించడానికి ప్రభుత్వం తమకు సమయం ఇవ్వాలని బొప్పరాజు(Bopparaju) కోరారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఎన్నికల ప్రక్రియను సక్రమంగా చేపట్టలేమని పేర్కొన్నారు. ఇదే జరిగితే ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసే ప్రమాదం ఉందని వెంకటేశ్వర్లు అన్నారు. అక్టోబర్ 1వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న సమావేశానికి సంబంధించి వాల్ పోస్టర్లను అసోసియేషన్ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.