Govt Agrees for DEO Posts: 38 డీఈఓ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
🎬 Watch Now: Feature Video
AP Govt approved the Deputy Educational Officers posts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ (38) పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని అనుమతిస్తూ.. ఏపీపీఎస్సీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల బోధనపై మరింత పర్యవేక్షణ కోసం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని.. ఆర్ధికశాఖలోని సర్వీసుల విభాగం ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి గానూ అనుమతులు మంజూరు అయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో.. డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 38 డీఈఓ (D.E.O.) పోస్టుల భర్తీకి APPSCకి అనుమతులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.. విద్యా బోధనపై మరింత పర్యవేక్షణ కోసం ఈ D.E.O. పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. డిప్యూటీ విద్యాశాఖాధికారి, గ్రేడ్-1 హెడ్ మాస్టర్ల పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేరుగా భర్తీ చేయాలని ఆదేశిస్తూ.. అనుమతులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో వివరించింది.