APMDC Tenders for Beach Sand Mining in AP: ఏపీలో బీచ్ శాండ్ మైనింగ్‌కు టెండర్లు..రూ.వెయ్యి కోట్లు వస్తుందని ఏపీఎండీసీ అంచనా - ఏపీ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 9:50 AM IST
APMDC Tenders for Beach Sand Mining in AP : ఏపీలో బీచ్ శాండ్ మైనింగ్‌కు టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఎండీసీ ద్వారా శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని సాగర తీర ప్రాంతాల్లో బీచ్ శాండ్‌ను మైనింగ్ చేయాలని నిర్ణయించారు. తద్వారా మోనజైట్, ధోరియం లాంటి భార ఖనిజాలను తవ్వకాలు చేపట్టేందుకు టెండర్లు పిలవాలని ఏపీఎండీసీ నిర్ణయం తీసుకుంది.
APMDC Tenders for Sand Mining : శ్రీకాకుళం, విశాఖ తీరప్రాంతాల్లో బీచ్ శాండ్ మైనింగ్ కాంట్రాక్టు ఏజెన్సీని ఖరారు చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం టెండర్లు పిలవాలని భావిస్తున్న ఏపీఎండీసీ టెండర్ డాక్యుమెంట్లను పరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్‌కు పంపింది. రెండు జిల్లాల పరిధిలో 1000 హెక్టార్ల ప్రాంతాన్ని బీచ్ శాండ్ మైనింగ్ కోసం ఏపీఎండీసీ ఎంపిక చేసింది. శ్రీకాకుళం జిల్లా గార ప్రాంతంలో 909.85 హెక్టార్లు, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 90.15 హెక్టార్లలో బీచ్ శాండ్ తవ్వకాల కోసం ఏపీఎండీసీకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సాగర తీర ప్రాంతంలో అత్యంత అరుదైన భార ఖనిజాల తవ్వకాల ద్వారా వెయ్యి కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చే అవకాశమున్నట్టు ఏపీఎండీసీ అంచనా వేస్తోంది. బీచ్ శాండ్ తవ్వకాల కోసం కాంట్రాక్టు ఏజెన్సీని ఖరారు చేస్తున్నందున దీనిపై బిడ్డర్లు, సాధారణ ప్రజలూ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది. అక్టోబరు 4 తేదీ వరకూ టెండర్ డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ వెబ్ సైట్లో ఉంచనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.