విశాఖ కైలాసగిరి కొండ దిగువన తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు - status quo on vizag Kailasagiri Hill
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 10:29 PM IST
AP High Court orders status quo on vizag Kailasagiri Hill: విశాఖ కైలాసగిరి కొండ దిగువన తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చింది. విశాఖలో తెన్నేటి పార్క్ పార్కింగ్ కోసం కొండను తవ్వుతున్నట్లు దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా కొండను తవ్వి పార్క్ కోసం నిర్మాణం చేపట్టారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ప్రభుత్వం నిభందనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది కె యస్ మూర్తి కోర్టుకు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని విశాఖ మున్సిపల్ అధికారులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అప్పటి వరకు యదాతదస్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విశాఖలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం అక్రమ నిర్మాణాల కోసం కొండలు, గుట్టలను సైతం తవ్వుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ పలువురు ప్రకృతి ప్రేమికులు ఆందోళన చేస్తున్నారు.