హైకోర్టులో ఉచిత ఇసుక పథకం కేసు - విచారణ రేపటికి వాయిదా - సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 8:32 PM IST
AP High Court Hearing on CBN Free Sand Bail Petition: ఉచిత ఇసుక పథకం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీఐడీ తరపున వాదనలు విన్న న్యాయస్థానం, పిటిషనర్ తరపున వాదనలు వినడానికి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అయితే సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక పాలసీ వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం చేకూరిందనే ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ కేసును నమోదు చేసింది. ఇసుక విధానం వల్ల ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించడమే కాకుండా, విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు చేపట్టారని ఆరోపణలు చేశారు. ఉచిత ఇసుక విధానం వల్ల ఇసుక రీచ్ల నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయం చెల్లించలేదని సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనివల్ల రాష్ట్ర ఆదాయానికి నష్టం చేకూరిందని పేర్కొన్నారు.