"కడపలో రాజకీయంగా పునాదులు కదులుతున్నాయనే బీటెక్ రవిని అక్రమంగా అరెస్టు చేయించారు"
🎬 Watch Now: Feature Video
AP Hates Jagan Poster Released by Ganta Srinivasa Rao : పదేళ్లుగా బెయిల్‌పై ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) ప్రతి ఒక్కరికి ఆ మరక అంటించేందుకు ప్రయత్నం చేయడం తప్ప మరొకటి లేదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖలో టీడీపీ-జనసేన ఉత్తరాంధ్ర సమన్వయ సమావేశంలో "ఏపీ హేట్స్ జగన్ (AP Hates Jagan Poster)" పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
Ganta Srinivasa Rao Fire on Cm Jagan : ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి పాలనకు అతి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారని అన్నారు. కడపలో రాజకీయంగా పునాదులు కదులుతుంటే.. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవిపై అక్రమ కేసులు పెట్టి.. అరెస్టు చేయించారని (B Tech Ravi Arrest) ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండిస్తూ ప్రజలు ఎలా రోడ్‌పైకి వచ్చారో చూశాక కూడ జగన్‌కు బుద్ది రాలేదన్నారు.
Ganta Srinivasa Rao Aigations on Welfare Schemes : సంపద సృష్టించి.. పేద వాడికి పంచాలి అనేది టీడీపీ ఆలోచన అయితే.. సంపద వద్దూ.. అప్పులు చేసేద్దాం అనేది వైసీపీ ఆలోచన అని గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. నవరత్నాలు, రైతు భరోసా, అమ్మఒడి పథకాలలో లోపాలు దొర్లుతున్నాయని, అందరికీ ఇళ్లు పేరిట 7000 కోట్లు వైసీపీ నేతలు మింగేశారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలుపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో టీడీపీ -జనసేన పార్టీ విభాగాలు పాల్గొన్నాయి.
TAGGED:
బీ టెక్ రవి అక్రమం అరెస్టు