AP Govt Permits for Filling Group2 Service Vacancies: గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వ అనుమతి.. ఎన్ని పోస్టులంటే..? - ఏపీలో గ్రూప్ 2 పోస్టుల భర్తీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 21, 2023, 12:05 PM IST
AP Govt Permits for Filling Group2 Service Vacancies: గ్రూప్- 2 సర్వీసుల్లో 212 ఖాళీలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఏపీ ఆర్థికశాఖలోని.. మానవవ వనరుల విభాగం ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి.. ఈ ఉత్తర్వులిచ్చారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో గ్రూప్- 2 ఉద్యోగాలు భర్తీ చేపట్టాల్సిందిగా ఏపీపీఎస్సీకి అనుమతి ఇస్తూ ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన.. ఖాళీలను భర్తీని చేపట్టాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదిలా ఉండగా గతంలో.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పచ్చజెండా ఊపారు. దాదాపు 1000కి పైగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. పోస్టుల భర్తీకి సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీపై సీఎం సమీక్షించారు. ఖాళీగా ఉన్న పోస్టుల గురించి సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు.