ఏపీ సీఆర్డీఏ బాండ్ల రేటింగ్ మరోసారి కుదేలు - బీబీబీ ప్లస్ నుంచి సీ గ్రేడ్‌కు కుదించిన రేటింగ్ ఏజెన్సీలు - APCRDA బాండ్లు రేటింగ్ తగ్గాయి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-12-2023/640-480-20164423-thumbnail-16x9-ap-crda-bond-rating-downgraded.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 10:15 AM IST
AP CRDA Bond Rating Downgraded to C Grade : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీ సీఆర్డీఏకి చెందిన బాండ్ల రేటింగ్ మరోసారి పడిపోయింది. స్టాక్ ఎక్స్చేంజీలో ఏపీ సీఆర్డీఏ చెందిన 2 వేల కోట్ల రూపాయల విలువైన బాండ్ల రేటింగ్‌ను త్రిబుల్ బీ ప్లస్ నంచి సీ స్థాయికి తగ్గిస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఏక్యూటీ తెలిపింది. అక్టోబరు నెలలో సీఆర్డీఏ సరైన చెల్లింపులు చేయకపోవటం, ఇతర సర్వీస్ ఛార్జీల విషయంలో నిర్లక్ష్య కారణంగా రేటింగ్ తగ్గించినట్లు తెలిపింది.
C Grade to APCRDA Bonds in Stock Exchange 2023 : అక్టోబరు నెలాఖరుకు చెల్లించాల్సిన 14.36 కోట్ల కన్సార్షియం లోన్‌ను నవంబరు 20 నాటికి చెల్లించారని పేర్కొంది. వాస్తవానికి ఈ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని రేటింగ్ సంస్థ పేర్కొంది. అలాగే మరో రూ.152 కోట్ల రుణానికి సంబంధించిన చెల్లింపుల హామీ, ఫిబ్రవరి 2024లో చెల్లించాల్సిన బకాయిలు వెరసి 430 కోట్ల రూపాయల ఎస్క్రో ఖాతాల్లో లేవని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని సీఆర్డీఏ సెక్యూరిటీ బాండ్ల రేటింగ్‌ను తగ్గించినట్టు తెలిపింది. రేటింగ్‌ను తగ్గించటంలో ఆంధ్రప్రదేశ్ రుణాలకు సంబంధించిన చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది.