Save Vizag Steel March: సేవ్ వైజాగ్ స్టీల్ మార్చ్ పేరుతో ఏపీ కాంగ్రెస్​ భారీ ర్యాలీ - విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 22, 2023, 1:23 PM IST

AP Congress Save Vizag Steel March in Visakha: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతునే ఉన్నాయి. ప్రైవేటికరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గి యథావిథిగా కొనసాగించాలని పలు సంఘాలు పోరాటం చేస్తునే ఉన్నాయి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి, ఏపీ కాంగ్రెస్​ నిరసన తెలిపాయి. 

విశాఖ స్టీల్ ప్లాంట్​ను రక్షించాలని.. ఏపీ కాంగ్రెస్ కమిటీ, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 'సేవ్ వైజాగ్ స్టీల్ మార్చ్' కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవ్ వైజాగ్ స్టీల్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జింక్ గేట్ నుంచి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి దీక్షా శిబిరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో.. పీసీసీ అధ్యక్షుడు గిడుగురుద్ర రాజు, కాంగ్రెస్ నేతలు, కార్మికులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం గాజువాక కూడలిలో రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు పోరాడతామని కాంగ్రెస్​ నేతలు స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.