ward councilor protested against MLA: "దళితుడినని వివక్ష చూపిస్తున్నారు.." ఎమ్మెల్యే వైఖరిపై కౌన్సిలర్ నిరసన - councilor
🎬 Watch Now: Feature Video

ward councilor protested against MLA: అన్నమయ్య జిల్లా మదనపల్లె వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మహ్మద్ నవాజ్ బాషాకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురైంది. ఎమ్మెల్యే నవాజ్ బాషా తన పట్ల అమానుషంగా మాట్లాడుతున్నాడని, కులం పేరుతో దూషిస్తున్నాడని మదనపల్లె పురపాలక సంఘం ఆరో వార్డు కౌన్సిలర్ ప్రసాద్ వాపోయారు. ఎమ్మెల్యే వైఖరికి వ్యతిరేకంగా కాలనీ వాసులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తూ 'ఎమ్మెల్యే డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. వార్డు కౌన్సిలర్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఒక దళిత కౌన్సిలర్ని అని ఎమ్మెల్యే చులకనగా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన వార్డులో ఒక్క రూపాయి కూడా పనుల కోసం ఇవ్వకుండా వేధిస్తున్నాడని తెలిపారు. వార్డు ప్రజలకు తాను సమాధానం చెప్పలేకపోతున్నానని, అందుకే వారి సమక్షంలోనే నిరసన తెలిపి వాస్తవాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. సమాచారం తెలుసుకున్న మదనపల్లి డీఎస్పీ కేశప్ప సిబ్బందితో హుటాహుటిన చేరుకుని కౌన్సిలర్ ప్రసాద్‌తో మాట్లాడారు. తక్షణమే నిరసన కార్యక్రమం విరమించుకోవాలని సూచించారు. కాగా, పోలీసుల తీరును నిరసిస్తూ కాలనీ ప్రజలు రోడ్డుపై బైఠాయించి.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.