Vijaykumar on State Debts: ఏప్రిల్‌లో రూ.23 వేల కోట్లు అప్పు.. ఈసారి ఏం తనఖా పెట్టారు..?: విజయ్‌కుమార్ - TDP leader Vijaykumar fire on CM Jagan
🎬 Watch Now: Feature Video
TDP leader Vijaykumar fire on CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఏప్రిల్ నెలలో చేసిన 23వేల 548 కోట్ల రూపాయల అప్పు ఏమైయిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అసలు ఇంత అప్పు జగన్ ప్రభుత్వం ఎలా చేసింది..? ఎక్కడ చేసింది..? ఎందుకు చేసింది..? ఆ డబ్బు ఏం చేశారు..? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వీటన్నింటికీ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన్న సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..''జగన్ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో చేసిన 23వేల 548 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఆర్‌బీఐ ద్వారా ఒక్క నెలలో చేసిన అప్పే రూ.6వేల కోట్లు ఉండగా, మిగిలిన మొత్తం ఎలా చేయగలిగింది. ప్రభుత్వం రహస్యంగా చేసిన రూ.17వేల కోట్ల అప్పును కాగ్ బయటపెట్టింది. కాగ్ నివేదిక తప్పా లేక ఆర్‌బీఐ నివేదిక తప్పా అనేది బుగ్గన సమాధానం చెప్పాలి. ఏయే ఆస్తులు తనఖా పెడితే, ఇంత భారీగా అప్పు చేయగలిగారో ప్రజలకు తెలియాలి'' అని ఆయన అన్నారు.