CM Welcome Flexi issue: విశాఖలో వినూత్న నిరసన.. 'రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం- సుస్వాగతం' - cm jagan tour news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 2, 2023, 1:08 PM IST

CM Jagan plexi is a hot topic in Visakha: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. విశాఖపట్టణం రుషికొండలోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి వెళ్లే దారిలో జన జాగరణ సమితి ఆధ్వర్యంలో కట్టిన ఫ్లెక్సీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 'రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం- సుస్వాగతం' అంటూ ఫ్లెక్సీలను కట్టి.. వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ.. రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి దేశ చరిత్రలో స్థిరస్థాయిగా మిగిలిపోతారన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఇంతటి గొప్ప రికార్డును సృష్టించిన జగన్‌కు.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా సన్మానం చేసి "క్యాపిటల్ లెస్ సీఎం" అనే బిరుదు ఇవ్వాలని కోరారు. 

ఎన్నికలకు ఏడాది ముందు మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు, అదానీ డేటా సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి.. ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రుల చెవిలో పూలు పెట్టాలని చూస్తున్నారని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ఆగ్రహించారు. కానీ, ఇక్కడి ప్రజలు ఎవరు కూడా జగన్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరని గుర్తు చేశారు. 29 వేల మంది అమరావతి రైతు కుటుంబాల కాపురాలను రోడ్డున పడేసిన ముఖ్యమంత్రి జగన్.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మాత్రమే విశాఖలో కాపురం పెడతానని ఇటీవలే ప్రకటించుకున్నారని.. ఉత్తరాంధ్రవాసులు చర్చించుకుంటున్నారని ఆయన వెల్లడించారు.

అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌పై జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌పై స్వామి భక్తి నిరూపించుకోవడానికి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రసాద్ రెడ్డి.. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన వ్యక్తం చేసిన తమ నాయకులపైన అక్రమ కేసులు పెట్టించి.. తమను భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర వాసులను జాగృతం చేయడానికి ఎన్ని అక్రమ కేసులు పెట్టిన తాము వెనకడుగు వేయమని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.