సీఎమ్మార్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో యాంకర్ అనసూయ సందడి - ప్రకాశం జిల్లాలో నటి అనసూయ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2023, 5:22 PM IST
Anchor Anasuya CMR Shopping Mall Opening In prakasam District : ప్రకాశం జిల్లా మార్కాపురంలో నూతనంగా నెలకొల్పిన సీఎమ్మార్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. నటి అనసూయ, మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మంత్రి షాపింగ్ మాల్ రిబ్బన్ కట్ చేశారు. నటి అనసూయ తదితరులు జ్యోతి ప్రజ్వల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన షాపింగ్ మాల్ యాజమాన్యం 28వ బ్రాంచ్ గా ఈ మాల్‌ను మార్కాపురంలో నెలకొల్పినట్లు తెలిపారు. మాల్లో చీరలు, డ్రెస్సులు, వన్ గ్రామ్ జ్యువెలరీ, మెన్స్ బట్టలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రారంభం అనంతరం షాపింగ్ మాల్ ఎదుట యాంకర్ అనసూయ సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా నటి అనసూయ మాట్లాడుతూసీఎమ్మార్లో అన్ని వేడుకలకు కావాల్సిన బట్టలు దొరుకుతాయని అన్నారు. తనకు సీఎమ్మార్‌లో కొన్న చీరలు అంటే చాలా ఇష్టం అని అన్నారు. తాను మొదటి సారి మార్కాపురం వచ్చానని ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది అని సంతోషం వ్యక్తం చేశారు.
TAGGED:
ap latest news