కర్నూలులో సందడి చేసిన హెబ్బా పటేల్, అనసూయ - Hebah Patel open a clothing store in Kurnool
🎬 Watch Now: Feature Video
కర్నూల్ లో యాంకర్ అనసూయ భరద్వాజ్, హీరోయిన్ హెబ్బా పటేల్ గురువారం సందడి చేశారు. నగరంలోని కందుకూరి వస్త్ర దుకాణాన్ని ప్రారంభించేందుకు వారు కర్నూలుకు వచ్చారు. అనసూయను, హెబ్బా పటేల్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. యాంకర్ అనసూయ మీడియాతో మాట్లాడుతూ.. అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెప్పారు. గతంలో ఒకసారి కర్నూలుకు వచ్చానని ఆమె గుర్తు చేసుకున్నారు. కోవిడ్ సమయంలో కర్నూలుకు రావలసిందని కానీ రాలేకపోయానని ఆమె అన్నారు. ప్రస్తుతం కర్నూలుకు రావడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. సినిమాల్లో బిజీగా ఉన్నందునే ఈ టీవీ జబర్దస్త్ షోకి దూరమయ్యాయనని అనసూయ అన్నారు. ఈరోజు ఉగ్గాని తినలేక పోయానని, ఉగ్గాని, బజ్జీలు తినేందుకు కర్నూలుకు మరోసారి వస్తానని, అలాగే ఈ ప్రదేశంలో హిస్టారికల్ ఆలయాలు బాగుంటాయని, ఆలయాలను చూసేందుకు తప్పకుండా ఇక్కడికి వస్తానని ఆమె అన్నారు. ఈ మధ్య చేసిన రంగ మార్తాండ సినిమా బాగుందని చూడని వాళ్లు ఉంటే కచ్చితంగా చూడాలని యాంకర్ అనసూయ అన్నారు.