Anam Venkata Ramana Reddy Comments on Jagan: 'ఆ నలుగురు వైసీపీ నేతలకు జగన్​ లక్షల కోట్లు దోచిపెట్టాడు' - Scenery tax

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 20, 2023, 4:44 PM IST

Anam Venkataramana Reddy Comments on CM Jagan: ప్రపంచంలో ఎక్కాడా లేనివిధంగా రాష్ట్రంలో విద్యుత్‌ విభాగంలోనూ మాఫియా డాన్‌ ఉన్నాడని.. తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి అన్నారు. భారీ టెండర్లు అన్నీ ఆయనకే వచ్చాయంటే జగన్‌కు ఎంత సన్నిహితుడో అర్థం చేసుకోవచ్చు అన్నారు. శిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌, మరో సంస్థకు రాష్ట్రంలో రూ. 1.7 లక్షల కోట్ల పనులు చేపడుతున్నాయంటూ తప్పుబట్టారు. జగన్మోహన్ రెడ్డి నలుగురు రెడ్లకు చిక్కటి చిరునవ్వుతో లక్షల కోట్లు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. సీఎం రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి కాంట్రాక్టులన్నీ నలుగురు రెడ్లకు అప్పగించారని దుయ్యబట్టారు. తాడేపల్లె ప్యాలెస్​లోని జగన్​కు డబ్బులు రావడం మాత్రమే తెలుసు.. వెళ్లే మార్గం తెలియదని ఆనం ఎద్దేవా చేశారు. ఇసుక, గ్రానైట్, ఎర్రమట్టి, మైనింగ్, మినరల్స్, మైకా లాంటి ఖనిజ సంపదకు సీనరేజి పన్ను కట్టకుండా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శించారు. 3 నెలల్లో రూ. 12 వేల కోట్లను రెడ్ల కంపెనీలకు ధారాదత్తం చేశారని ఆనం ఆక్షేపించారు. పీఎల్ఆర్, మేడా కన్​స్ట్రక్షన్స్, షిర్డీసాయి ఇండోసోల్, రాఘవ కన్​స్ట్రక్షన్స్, మెగా కన్​స్ట్రక్షన్స్​లకు ప్రజల సొమ్ము అప్పణంగా దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.