Amaravati Inner Ring Road: ఏదో చేశాడని పుట్టని బిడ్డపై క్రిమినల్ కేసులు..! 'రింగ్ రోడ్డు ప్రాజెక్టు - వాస్తవాలు'.. బుక్ విడుదల చేసిన టీడీపీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 3:55 PM IST

Updated : Oct 7, 2023, 4:58 PM IST

 Amaravati Inner Ring Road project case:  జగన్ ప్రభుత్వం పంచభూతాలను దోచుకుంటోందని.. ఆ దోపిడీని ప్రశ్నిస్తే చంద్రబాబును జుడిషియల్ కస్టడీలో పెట్టారంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి ఎలా జరిగింది అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు.. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు - వాస్తవాలు పేరిట పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో పుస్తకాన్ని అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఏదో చేశాడని పుట్టని బిడ్డపై క్రిమినల్ కేసులు రాజకీయ కుట్ర కాదా అని పుస్తకం ద్వారా తెలుగుదేశం నిలదీసింది. స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొన్నారు.  నెల రోజుల తర్వాత ఏఏజీ చావు కబురు చెప్పారంటూ మండిపడ్డారు. రింగు రోడ్డు లేదు, బొంగు రోడ్డు లేదంటూ అచ్చెన్నాయుడు (Atchannaidu) దుయ్యబట్టారు. ఆధారాల్లేకుండా స్కిల్ కేసు, సంబంధం లేకున్నా ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అంశాల్లోనూ కేసులు పెట్టారని ఆరోపించారు. ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా జగన్ నాశనం చేశారని చంద్రబాబు ప్రజల్లో చైతన్యం కలిగించడంతో జగన్ లో భయం మొదలైందన్నారు. 

బడ్జెట్ కేటాయింపులే జరపలేదు: ఎమ్మెల్యే ఆర్కే రింగ్ రోడ్డు(Inner Ring Road)లో అక్రమాలంటూ తప్పుడు ఫిర్యాదు చేస్తే.. ఆఘమేఘాలపై కేసు నమోదు చేశారని టీడీపీ నేత పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమా విమర్శించారు. ఒకే అబద్దాన్ని పది మంది మాట్లాడతారన్న ఆయన, పదే పదే మాట్లాడి అబద్దాలను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.  నారాయణ భూమి అక్కడ లేనే లేదని అన్నారు. నారాయణ అద్దె భవనంలో కాలేజ్ నిర్వహిస్తోంటే.. ఆ అద్దె భవనం కోసం అలైన్మెంట్ మార్చాలని ఒత్తిడి తెచ్చారని తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఉమా ఆరోపించారు. ఐఆర్ఆర్ కోసం బడ్జెట్ కేటాయింపులే జరపలేదని అన్నారు. జగన్‌ది దరిద్రపాదమని విమర్శించారు. జగన్ వల్లే అమరావతి ( Amaravati ) నాశనమైందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన మీదున్న జైలు ముద్రను చంద్రబాబుపైనా వేయాలనేదే జగన్ కుట్రగా బొండా ఉమా ధ్వజమెత్తారు. 

Last Updated : Oct 7, 2023, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.