వార్షిక కౌలు చెల్లించాలంటూ అమరావతి రైతుల ఆందోళన - సీఆర్డీఏ డిప్యూటీ కమిషనర్‌కు వినతి పత్రం - అమరావతి రైతుల ఆందోళన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 4:19 PM IST
Amaravati Farmers Protest: వార్షిక కౌలు చెల్లించాలంటూ రాజధాని రైతులు విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. గతేడాది మేలో ఇవ్వాల్సిన కౌలు 8 నెలలు గడిచినా ఇప్పటికీ చెల్లించకపోవడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోలె పట్టి కౌలు వేయాలంటూ అధికారులను అర్థించారు. అలాగే అసైన్డ్ రైతులు, భూమి లేని కూలీలను ఆదుకోవాలని నినాదాలు చేశారు. సీఆర్డీఏ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి రైతులను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సీఎం అయినప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరిగితే గానీ వార్షిక కౌలు చెల్లించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా భూములు ఇచ్చినందుకు ఈ రకంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. తమ కౌలు నగదును చెల్లించేందుకు ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తోందని పేర్కొన్నారు. అమరావతి రైతుల నిరసనకు సీపీఐ నేతలు మద్దతు పలికారు.