Amaravati Farmers: ప్రభుత్వం పేదలను మోసం చేయడం మానుకోవాలి: అమరావతి రైతులు - Supreme Court Latest judgments
🎬 Watch Now: Feature Video
Farmers opinion about SC Judgment on R5 zone: అమరావతి ప్రాంతంలోని.. ఆర్-5 జోన్‌పై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. పట్టాలు ఇస్తే కనుక అది తుది తీర్పునకు లోబడి ఉంటుందని కీలక ఆదేశాలు జారీ చేసింది. పట్టాల విషయంలో తుది తీర్పునకు లోబడి ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై.. రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. రాజధాని భూములపై పట్టాదారులకు థర్డ్ పార్టీ హక్కు ఉండదని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. హైకోర్టులో పెండింగులో ఉన్న రిట్ పిటిషన్ తీర్పునకు లోబడే పట్టాల చెల్లుబాటు ఉంటుందని తేల్చిచెప్పడంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం పేద ప్రజల్ని మోసం చేయడం మానుకోవాలని రాజధాని వాసులు హితవు పలికారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే పట్టాలు వారికి ఎలాంటి హక్కులు కల్పించవు కాబట్టి ఆ పట్టాల వలన ఉపయోగం లేదన్నారు. అలాంటి పట్టాలను పంపీణి చేసి పేద ప్రజలను మోసం చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు.