అమరావతిలో 'తుగ్లక్ డే వార్షికోత్సవ సభ' ఏర్పాట్లు - రాజధాని రైతుల ఉద్యమానికి నాలుగేళ్లు - ఏపీ తుగ్లక్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 8:06 PM IST
|Updated : Dec 16, 2023, 9:38 PM IST
Amaravati Farmers celebrate Tughlaq Day tomorrow: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసింది. ఈ ప్రకటన చేసి నాలుగు ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 4వ తుగ్లక్ డే వార్షికోత్సవ సభను రాజధానిలో నిర్వహించేందుకు సిద్దమైనట్లు ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వెల్లడించారు. ఈ మేరకు విజయవాడలో మీడియా సమావేశంలో నిర్వహించారు. బాలకోటయ్య మాట్లాడుతూ డిసెంబర్ 17వ తేదీతో రాజధాని రైతులు ఉద్యమం చేపట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయంపై గత నాలుగు సంవత్సరాలుగా రైతులు ఆందోళన చేస్తున్నారని, అయినా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని మండిపడ్డారు.
మూడు రాజధానుల ప్రకటన చేసింది మెుదలు ఒక్క పారిశ్రామికవేత్త కూడా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోర్టులు అన్నా, చట్టాలన్నా ఏమాత్రం గౌరవం లేదని బాలకోటయ్య పేర్కొన్నారు. రాజధాని అంశంపై హైకోర్టు తీర్పులు తీర్పు ఇస్తే, పదేపదే సుప్రీం కోర్టుకు వెళుతున్నారని ఎద్దేవా చేశారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ సీఎం జగన్ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఉంటే ఆ నొప్పి తెలిసేదని బాలకోటయ్య ఎద్దేవా చేశారు. రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు ఒక్కరైనా కనీసం రాజధాని కోసం గజం భూమైన ఇచ్చారా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో రాజధాని అభివృద్ధి చేసే వారికే తమ ఓటు వేసి గెలిపిస్తామని, సీఎం జగన్కు తగిన బుద్ధి చెబుతామని బాలకోటయ్య వెల్లడించారు.