కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త బిల్లులపై 'ఐలు' అభ్యంతరం - 'ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ' - Narra Srinivas latest update

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 1:35 PM IST

AILU Criticized Introduction New bills in Place of Old Bills: ఐపీసీ(I.P.C), ఐఈఏ (I.E.A), సీపీసీ (C.P.C) చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకురావడాన్ని అఖిల భారత న్యాయవాదుల సంఘం(AILU) తప్పుబట్టింది. బిల్లులపై పార్లమెంటులో కనీసం చర్చించకుండా ఆమోదించడం సరికాదని న్యాయవాదుల సంఘం జాతీయ కార్యదర్శి నర్రా శ్రీనివాస్‌ అన్నారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. 

చట్ట సవరణలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవటం తప్పనిసరని శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో చర్చలు లేకుండా చట్టాలు చేయటం ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటింగ్​లో అధికార పక్షం మాత్రమే పాల్గొని, ప్రతిపక్ష పార్టీ నేతలు లేకుండా ఓటింగ్ జరిపి కొత్త చట్టాల్ని ఆమోదించటం సరికాదన్నారు. గతంలో ఐలు(All India Lawyers Union) తరపున కేంద్ర న్యాయశాఖకు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇచ్చామని, వాటిని పట్టించుకోకుండానే కొత్త చట్టాల్ని ఆమోదించటం సరికాదని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.