Agrigold Victims Chalo Vijayawada : 'ఆరు నెలల్లో ఆదుకుంటామని మర్చిపోయారు..' 15న అగ్రిగోల్డ్ బాధితుల 'చలో విజయవాడ' - Agrigold Agents Association
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 13, 2023, 7:32 PM IST
Agrigold Victims Chalo Vijayawada : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... సెప్టెంబర్ 15వ తేదీన బాధితులతో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ (Agrigold Agents and Customers Association) గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో మృతి చెందిన బాధితులకు పరిహారం, కొంతమందికి న్యాయం చేయగలిగామని చెప్పారు.
కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బాధితులను ఆదుకుంటాం అని చెప్పి... ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయారన్నారు. 'పాలకులు కళ్లు తెరవండి.. బాధితులను ఆదుకోండి.. ఇచ్చిన హామీ అమలు చేయండి' అనే నినాదంతో బాధితుల శంఖారావ దీక్ష చేపడుతున్నామని తెలిపారు. 98 శాతం హామీలు పూర్తి చేశామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి, మిగిలిన 2 శాతంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలన్నారు. 20 వేలు డిపాజిట్ ఉన్న బాధితులకు బటన్ నొక్కి డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఇప్పటికైనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు.