హామీలు నేరవేర్చకపోతే సీఎం జగన్​ను ఏకమై ఓడిస్తాం: ముప్పాళ్ల నాగేశ్వరరావు - విజయవాడలో విమోచన దీక్షలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 8:06 PM IST

Agrigold Vctims Agents Satyagraha Initiation: అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో బాధితులు, ఏజెంట్లు సత్యాగ్రహ దీక్ష చేశారు. ఈ దీక్షలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. 2017లో అప్పటి ప్రతిపక్షనేత జగన్ ఇచ్చిన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం అందిస్తామని చెప్పి మాట తప్పారని ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారని తెలిపారు. ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయకపోతే అందరం ఒక్కటై జగన్​ను ఓడిస్తామని హెచ్చరించారు. ఈనెల 18వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్​ల వద్ద భారీ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 28, 29 తేదీలలో విజయవాడలో విమోచన దీక్షల పేరుతో 48 గంటల దీక్షలు చేపడతామని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.