Agriculture Products MSP list display in Secreteriats: వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరల పట్టిక ఇకపై గ్రామ సచివాలయాల్లో.. గోడ పత్రిక విడుదల చేసిన మంత్రి - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2023, 3:36 PM IST
Agriculture Products MSP list display in Secreteriats రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ కంటే ముందే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధతు ధరలు ప్రకటించామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర సచివాలయంలో అధికారులతో కలిసి ఆయన వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో 22 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన కొనుగోలు ధరల్ని ప్రకటించామని మంత్రి తెలిపారు. వరి, పసుపు, ఉల్లి, మిర్చి, చిరు ధాన్యాలు, మినుములు, వేరు శనగ, కొబ్బరి, పత్తి, బత్తాయి, అరటి లాంటి 22 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు సంబందించి మద్ధతు ధరలను ప్రకటిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. మద్దతు ధరలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించేందకు ప్రతీ రైతు భరోసా కేంద్రంలోనూ దీన్ని ప్రదర్శిస్తామని ఆయన తెలిపారు. దళారుల బెడద, రవాణా ఖర్చుల ఇబ్బందులు లేకుండా సీఎం యాప్ ద్వారా రైతు భరోసా కేంద్రాల్లోనే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.