జిందాల్​తో స్టీల్​ ప్లాంట్​ యాజమాన్యం ఒప్పందం - వ్యతిరేకిస్తున్న కార్మికులు

🎬 Watch Now: Feature Video

thumbnail

Agreement With Jindal to Visakha Steel Plant : విశాఖ స్టీల్​ ప్లాంట్​లో బ్లాస్ట్​ ఫర్నేస్​-3 ని పునర్​ ప్రారంభించేందుకు జిందాల్​తో ఒప్పందం చేసుకోవడంపై కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. స్టీల్​ ప్లాంట్​లో కార్మిక సంఘాలతో సీఎండీ అతుల్​ భట్ సమావేశమయ్యారు. 800 నుంచి 900 కోట్ల రూపాయల జీఎస్​పీఎల్​ పెట్టుబడికి అవకాశం ఉందన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా కేంద్రం ఒత్తిడి మేరకే జిందాల్​తో ఒప్పందం చేసుకున్నారని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎండీ సమావేశంలో కార్మికులు కిందనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Workers Protest : జిందాల్​తో చీకటి ఒప్పందానికి విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెరతీసిందని ఓ కార్మికుడు ఆరోపించారు. దిల్లీ పెద్దల ఆజ్ఞలతో ఈ నెల16న ఆగమేఘాలతో జిందాల్​తో ఒప్పందం చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ నెల 19న జిందాల్​తో ఒప్పందం చేసుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. కనీసం స్టీల్​ ప్లాంట్ కార్మికులతో సంప్రదింపులు జరపకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ ఒప్పందం కారణంగా కార్మికుడికి ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో తెలియజేయాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.