'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమంలో ఘర్షణ - anantapur adudam andhra
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 7:21 PM IST
Adudam Andhra Program Clash in Anantapur District : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన ' ఆడుదాం ఆంధ్ర ' కార్యక్రమం అనంతపురం జిల్లాలో ' కొట్టుకుందాం ఆంధ్రా' గా మారింది. కంబదూరు మండల కేంద్రంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కబడ్డీ పోటీల్లో గురువారం ఆటగాళ్ల మధ్య ఘర్షణ నెలకొంది. కంబదూరు, తిమ్మాపురం జట్ల మధ్య కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పాయింట్ల విషయంలో ఇరు జట్ల మధ్య తోపులాటకు దారి తీసింది.
Clash Between Two Teams in Kabaddi Game : కబడ్డీ పోటీలో ఎంపైర్ ఇచ్చిన పాయింట్ల విషయంలో తేడా వచ్చి ఇరు జట్ల వాగ్వాదానికి దిగారు. క్రీడాకారుల మధ్య చిన్నగా మొదలైన ఘర్షణ మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వచ్చిందని స్థానికులు తెలిపారు. ఎంపైర్పై సైతం క్రీడాకారులు దాడికి యత్నించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై ఆరాదీశారు.