నాలుగేళ్ల కదా..! జగన్ మళ్లీ గెలిస్తే, మంచి అనుభవం వస్తుంది.. మంచి పాలన వస్తుంది..! - sensational comments on cm jagan
🎬 Watch Now: Feature Video
YCP MLA SAI PRASAD REDDY COMMENTS ON CM JAGAN : జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో సీఎం జగన్‌పై ఆదోని వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు అనుభవం తక్కువ ఉందని.. మరో ఐదు సంవత్సరాలు పూర్తైతే మరింత అనుభవం వస్తుందని అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్‌లో శుక్రవారం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 30ఇళ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మళ్లీ గెలిస్తే జగన్‌కు అనుభవం వస్తుందని.. అనుభవం ఉంటే మెరుగైన పాలన అందించేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిన్నటి నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాల గురించి.. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇళ్లకు స్టిక్కర్లు అతికిస్తున్నారు.