Adivasis Protest against MLA Dhanalakshmi : గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేను నిలదీసిన ఆదివాసీలు.. తమ సంక్షేమానికి ఏం చేశారని ధ్వజం! - Protest against MLA Dhanalakshmi
🎬 Watch Now: Feature Video
Adivasis Protest against MLA Dhanalakshmi : అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం నెల్లిమెట్ల గ్రామంలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిని ఆదివాసీలు నిలదీశారు. నెల్లిమెట్ల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సమస్యలు తెలుసుకుంటుండగా ఆదివాసీల సంక్షేమానికి నాలుగేళ్లలో ఏం చేశారంటూ వారు ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇంతవరకు ఎందుకు కేటాయించలేదని నిలదీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరిస్తుండగా, ఎస్టీలకు ప్రత్యేకంగా ఏం చేశారని ప్రశ్నించారు. ఆదివాసీలకు కేటాయించాల్సిన నిధులను పక్కదారి పట్టించి ఇతర పథకాలకు ఎందుకు వర్తింప చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీల ఆందోళనకు మద్దతుగా ఒక ప్రకటన చేయలేక పోయారన్నారు. దీంతో ఎస్సై నరేంద్ర ప్రసాద్, వైకాపా నాయకులు జోక్యం చేసుకొని గ్రామ సమస్యలు మాత్రమే అడగండి అని సూచించడంతో ఆదివాసీలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు ఇరువురి మధ్య వాగ్వావాదం జరిగింది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే చెప్పటంతో.. నాలుగేళ్లలో చేయలేనిది ఆరు నెలల్లో ఎం చేస్తారంటూ ఆదివాసీలు ధ్వజమెత్తారు.