Film actor Suman comments: బీసీలకు మద్దతు ఇచ్చే పార్టీలకే ఓట్లు ఓటేయండి : సినీ నటుడు సుమన్ - సినీ నటుడు సుమన్
🎬 Watch Now: Feature Video
Film actor Suman comments: రాష్ట్ర ప్రభుత్వం బీసీల రక్షణ విషయంలో ఉదాసీనంగా ఉందని సినీ నటులు సుమన్ విమర్శించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్ధార్ గౌతు లచ్నన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సుమన్ మాట్లాడారు. బాపట్ల జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్ధిని దారుణంగా చంపితే చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బీసీలకు ప్రత్యేకంగా పార్టీ లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. అందుకే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకే మద్ధతు ఇవ్వాలని సూచించారు. పార్టీల మ్యానిఫెస్టోలో బీసీలకు ఎవరు ఏం చేస్తారనే దాన్ని బట్టి ఓట్లు వేయాలని చెప్పారు. కార్యక్రమానికి ముందు సుమన్ పెదకాకాని శివాలయంలోని మల్లేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ''ప్రతి కులానికీ ఓ పార్టీ తయారవుతోంది. కానీ, మన బీసీలకు పార్టీ ఏముంది. మేనిఫెస్టోలో బీసీలకు సీట్లు, ప్రాధాన్యాలను కల్పించిన పార్టీలకు ఓటు వేయాలి. మన కులం వాళ్లు అన్ని పార్టీల్లోనూ ఉండాలి. ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే ఏడ్చి ప్రయోజనం లేదు. బీసీలకు చాలా అన్యాయం జరుగుతోంది. ఈ మధ్య ఓ బీసీ అబ్బాయిని కాల్చి పడేస్తే ఈ రోజు వరకూ జవాబు లేదు. మనం సైలెంట్ గా ఉంటాం.. అవసరమైతే వయిలెంట్ గా వెళ్తాం.." అని సుమన్ పేర్కొన్నారు.