Achenna on Projects: 'జలవనరుల ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన రాయలసీమ ద్రోహి.. జగన్ రెడ్డి' - Projects in AP
🎬 Watch Now: Feature Video
Achenna on Rayalaseema Projects: నాలుగేళ్లలో సీఎం జగన్మోహన్‌రెడ్డి.. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, ఒక్క ఎకరాకు నీరందించలేదని.. తెలుగుదేశం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసి కాంట్రాక్టర్లను మార్చి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. సీమకు.. అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తుంటే న్యాయ రాజధాని అంటూ.. ప్రజలను మోసం చేస్తూ ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా- గోదావరి జలాల్లో.. ఏపీ హక్కుల్ని కేంద్రానికి దారాదత్తం చేసిన జగన్.. రాయలసీమ ద్రోహిగా మిగిలారని అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం.. ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులపై 8 వేల 292 కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ నాలుగేళ్లలో 2 వేల 11 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని వివరించారు. ఎన్టీఆర్ ఆరంభించి చంద్రబాబు అభివృద్ధి చేసిన.. తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, స్వర్ణముఖి ప్రాజెక్టులు.. రాయలసీమకు వరప్రసాదాలైనట్టు వివరించారు. తెలుగుదేశం హయాంలో ప్రారంభించిన ముచ్చుమర్రి ఆర్డీఎస్, గుండ్రేవుల, వేదవతి, గాలేరు-నగరి, హంద్రీ-నీవా కాల్వల సామర్థ్యం పెంచేందుకు.. జగన్ తగిన నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. రాయలసీమకు శరాఘాతంలా ఉన్న అప్పర్ భద్రపై.. జగన్ నోరు మెదపని పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు.