అంగన్వాడీల ఆందోళనపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదు?: ఆచంట సునీత - ntr district news update
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 10:33 PM IST
Achanta Sunitha on Anganwadi Strike : రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు సమ్మె సైరన్ మోగించినా ప్రభుత్వం వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ రాష్ట్ర డ్వాక్రా సాధికార విభాగాల అధ్యక్షురాలు ఆచంట సునీత మండిపడ్డారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు 16 రోజులుగా సమ్మె చేస్తున్నా అధికార పార్టీ నేతలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వారి కంటే ఎక్కువ వేతనం చెల్లిస్తామని వారిని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు.
Government Negligence : అధికార నేతలు అంగన్వాడీ కార్యకర్తలతో నామమాత్రంగా చర్చలు జరిపారని సునీత వ్యాఖ్యానించారు. అంగన్వాడీ కార్యకర్తలతో చర్చలు జరిపి వారికి ఏ హామీ ఇచ్చారని ప్రశ్నించారు. అంగన్వాడీ కార్యకర్తల సమ్మె గత రెండు వారాలుగా జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు రూ.4500 నుంచి 10,500 పెంచారని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికార పార్టీ రూ.1000 పెంచి సీఎం జగన్ గొప్పలు చెప్పుతున్నారని ఉద్ఘాటించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.